దేశీ దారు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
ADB: అక్రమంగా మహారాష్ట్ర దేశీదారు విక్రయిస్తున్న ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు ఎక్సయిజ్ సిఐ జుల్ఫికర్ తెలిపారు. శుక్రవారం సోనాల మండలంలోని సంపత్ నాయక్ తండా గ్రామంలో దాడులు నిర్వహించగా రాథోడ్ పూల్ సింగ్, రాథోడ్ సంజు వద్ద 130(90 ML) దేశీ దారు బాటిల్స్ పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఈ దాడులలో ట్రైనీ సబ్ ఇన్‌స్పెక్టర్ V. శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.