చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం: ఎమ్మెల్యే

కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని సోమవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండే వేసవిలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.