గణపవరం అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
ELR: గణపవరం మండలంలో ఒక అంగన్వాడీ హెల్పర్ పోస్టు భర్తీకి దరఖాస్తులను నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ తోట లక్ష్మీ సరస్వతి తెలిపారు. గణపవరం 7వ కేంద్రంలో ఉన్న ఈ బీసీ-బి రిజర్వేషన్ పోస్టుకు స్థానికులైన, వివాహిత మహిళలు మాత్రమే అర్హులు. దరఖాస్తుదారులు 10వ తరగతి పాసై, 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.