మాల సింహ గర్జన కరపత్రాల ఆవిష్కరణ

CTR: మార్చి 23న తిరుపతిలో రాయలసీమ మాల సింహ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ తెలిపారు. బుధవారం పుంగనూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మహానాడు మాల జేఏసీ ఆధ్వర్యంలో సభకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సింహ గర్జన సభకు మాలలు, మేదావులు, విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.