రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
E.G: రాజమండ్రిలోని గాడాల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన వ్యక్తి కోరుకొండ నుంచి వస్తూ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీస్‌లు ఘటనా స్థలనికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.