VIDEO: కార్పొరేటర్ పర్యవేక్షణలో కుమ్మరి కుంట పరిశుభ్రం

RR: హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని కుమ్మరి కుంట వర్షపు నీటితో నిండి అలుగు పారుతోంది. దీంతో డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కుమ్మరికుంట పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త చెదరాన్ని శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ ఉండటంతో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.