గుంటూరులో నేడు పవర్ కట్

GNTR: 11 కేవీ హరిహర మహాల్ ఫీడర్‌లో చెట్టుకొమ్మలు తొలగింపు నేపథ్యంలో గుంటూరులో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గురవయ్య తెలిపారు. లక్ష్మీపురం, రామన్నపేట, ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.