అత్యాచారం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష
VKB: వికారాబాద్ కోర్టు అత్యాచారం కేసులో నిందతుడు అంజయ్యకు పదేళ్ల జైలు శిక్ష, రూ.12 వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 2016లో పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను బెదిరించి అంజయ్య అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. కోర్టులో సమర్పించిన పక్కా సాక్షాధారాలతో నేరం రుజువు కావడంతో ఈ తీర్పు వెలువడింది.