అభయ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

అభయ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

CTR: దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయం అనుబంధంగా ఉన్న ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన మంగళవారం రోజున ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అభయ ఆంజనేయ స్వామినీ పలు రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేకించి స్వామివారిని విశేషంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు విశేషంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.