VIDEO: వాచ్‌మెన్ ఇంట్లో పాము హల్ చల్
ATP: గుత్తి చెర్లోపల్లి కాలనీలో వాచ్‌మెన్ వలి ఇంట్లో గురువారం జర్రీ పొతు పాము హల్ చల్ చేసింది. ఇంట్లో కుటుంబ సభ్యులు పనులు చేస్తుండగా పాము కనిపించింది. వెంటనే కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పాములు పట్టే జేమ్స్ పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలివేయడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.