మరోసారి అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
అమెరికాలోని ఆస్టిన్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ బార్‌లోకి దూరిన దుండగుడు అకస్మాతుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.