రేపు దోమకొండలో జిల్లా విలువిద్య పోటీలు
KMR: దోమకొండలోని గడి కోటలో రేపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విలువిద్య పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విలువిద్య అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమల గౌడ్ ఈరోజు తెలిపారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 8 గంటల వరకు గండికోటలోకి రావాలని సూచించారు. ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి పోటీలలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు.