WJI జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుడాల శ్రీనివాస్
KNR: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా(WJI) జిల్లా ప్రధాన కార్యదర్శిగా గన్నేరువరం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, రిపోర్టర్ గుడాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.