కొడాలి నానిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ సెటైర్లు

కొడాలి నానిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ సెటైర్లు

కృష్ణా: మంగళగిరిలో శనివారం కొడాలి నానిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ సెటైర్లు వేశారు. జగన్ సంతోషం కోసం కొడాలి నాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, ఇప్పుడు ‘రెడ్ బుక్’ పేరు వినగానే డైపర్లేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అప్పుడు సింహాలు ఇప్పుడు గ్రామ సింహాలు అని ఆయన విమర్శించారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ నేతల సంతకాల సేకరణ ఓ నాటకమని అన్నారు.