అధ్వానమైన రోడ్డులో అంతులేని అవస్థలు
MBNR: గండీడ్ మండలం రంగారెడ్డిపల్లి నుంచి పరిగి నియోజకవర్గానికి వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. ప్రభుత్వాలు మారినా రోడ్డు రూపురేఖలు మారడం లేదని వాహనదారులు విమర్శిస్తున్నారు. లింగాయపల్లి, వర్వాల్, జిన్నారం ఇలా పలు గ్రామాల నుంచి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే రాత్రుళ్లు ప్రమాదాల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.