VIDEO: ‘నిరంతరం పేదలకు సహాయం అందిస్తున్న సీఎం’
SKLM: ఆర్థిక సమస్యలున్నా సీఎం చంద్రబాబు నిరంతరం పేదలకు సహాయం అందిస్తున్నారని మంత్రి అచ్చన్న నాయుడు అన్నారు. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్‌లో రూ.23 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఇవాళ ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గంలో 22 నెలల్లో 304 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రూ.3.2 కోట్లు అందించామన్నారు.