దళితులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి: సీపీఐ
KMM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ విమర్శించారు. సోమవారం ఖమ్మంలో నిర్వహించిన DHPS జిల్లా రెండో మహాసభలో ఆయన ప్రసంగించారు. దళితులు నేటికీ కుల వివక్షతో ఇబ్బందులు పడుతున్నారని, వారిని సామాజికంగా, న్యాయపరంగా రక్షించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు.