తప్పిపోయిన యువకుడు ఆచూకీ లభ్యం
KKD: కిర్లంపూడి మండలం సోమరాయునిపాలెం గ్రామానికి చెందిన తప్పిపోయిన యువకుడు డీ.ఎస్. రాజు (29) ఆచూకీ లభ్యమైంది. మిస్సింగ్ కేసుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు సీఆర్ నెం. 146/2025 కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ప్రకాశం జిల్లా పొదిలి వద్ద రాజును ట్రేస్ చేసి, కిర్లంపూడికి తీసుకువస్తున్నట్లు పోలీసులు తెలిపారు.