వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై

వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం అడ్డరోడ్డు వద్ద బుధవారం ఎస్సై మాధవరావు వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనాల్లో గంజాయి వంటి మత్తు పదార్థాలను, మారణాయుధాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు. వాహనదారులు అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు.