VIDEO: యుద్ధం ఎఫెక్ట్.. జిల్లాలో ‘నో స్టాక్’ బోర్డులు
ములుగు జిల్లాలో ఇంధన సరఫరా తగ్గడంతో బుధవారం పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బంకుల్లో పరిమితంగా డీజిల్ మాత్రమే లభిస్తుండగా, ములుగులోని రెండు బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఈ క్రమంలోనే ఇవాళ పత్తిపల్లి రోడ్డులోని బంకు వద్ద వాహనాల రద్దీ పెరిగింది.