31న పీడీఎస్ బియ్యం వేలం పాట

VZM: రేగిడి మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఈనెల 31న ఉదయం 10 గంటలకు గోదాం వద్ద 15 కేజీల పీడీఎస్ బియ్యం వేలం పాట వేయనున్నట్లు డిటి సత్యనారాయణ తెలిపారు. ఈ వేలం పాటలో ఆసక్తిగల వారు పాల్గొనాలని వారు కోరారు. ప్రభుత్వ నిర్దేశ ధరలకే వేలంపాట ఉంటుందన్నారు. పూర్తి సమాచారం కోసం తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.