ఇంధన ఆందోళనల వేళ.. మోదీ కీలక భేటీ

ఇంధన ఆందోళనల వేళ.. మోదీ కీలక భేటీ

దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్ సింగ్, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌లతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత్‌పై ప్రభావం, ఇంధన సరఫరా తదితర అంశాలపై సమీక్షించినట్లు తెలుస్తోంది.