'అన్నదాన సత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి'
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అన్నదాన సత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆర్ అండ్ బీ అధికారులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ నూతన అన్నదాన సత్రం పనులు కొనసాగుతుండగా, శనివారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వరరెడ్డి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.