VIDEO: భారీ వర్షాలతో కంచిపల్లె చెరువుకు జలకళ

VIDEO: భారీ వర్షాలతో కంచిపల్లె చెరువుకు జలకళ

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని కంచిపల్లె చెరువు ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా నిండింది. గుండ్లమోటు ప్రాజెక్టుకు వచ్చిన వరదనీరు కంచిపల్లె చెరువుకు చేరడంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 7 సంవత్సరాలుగా ఎండిపోయిన ఈ చెరువులోకి ఇప్పుడు నీరు రావడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.