వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి: డీఐఈఓ

WGL: వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని డీఐఈఓ జితేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు జూనియర్ కళాశాలలను ఆయన సందర్శించారు. తరగతి గదుల్లోని విద్యార్థుల విద్యా సామర్థ్యాలను ఆయన ప్రత్యక్షంగా పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. సిలబస్ త్వరగా పూర్తి చేసి రివిజన్ చేయాలని అధ్యాపకులకు సూచించారు.