చపాతీ ప్యాకెట్‌లో ఫంగస్

కృష్ణా: కంకిపాడు మండలం, ఈడుపుగల్లులో ఒక షాప్ నుంచి ఓ వ్యక్తి మోడల్ డైరీ చపాతీలు తీసుకున్నాడు. అనంతరం ప్యాకెట్ తెరిచి చూసేసరికి చపాతి అంతా ఫంగస్‌తో ఉన్నట్టు గమనించాడు. వినియోగదారు, వెంటనే ఫోటోలు తీసి ఆధారాలు సేకరించారు. ఆహారం నిల్వ విధానంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.