రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
MBNR: నవాబ్ పేట్ మండల కేంద్రానికి సమీపంలో శనివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని బొలేరో వాహనం ఢీకొనడంతో ఎన్మనగండ్లకి చెందిన బ్యాగరి చంద్రయ్య (52) మృతి చెందారు. పెట్రోల్ బంకు వద్ద మహబూబ్ నగర్ నుంచి వస్తున్న బొలేరో అదుపుతప్పి చంద్రయ్య వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో చంద్రయ్య అక్కడికక్కడే మరణించారు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.