సిద్దిపేట జిల్లాలో 10 నుంచి జాగ్రత్త
SDPT: జిల్లాలో డిసెంబర్ 10 నుంచి 13 వరకు రాబోయే 7 రోజుల్లో శక్తివంతమైన శీతల గాలలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పింక్ మార్కు ఉన్న జిల్లాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు 6-9°C వరకు తగ్గనున్నాయి. అదేవిధంగా నీలం మార్క్ ఉన్న జిల్లాల్లో 9-12°C వరకు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.