శయన ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అభిషేకం

శయన ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అభిషేకం

HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో శ్రీ శివాలయం ప్రాంగణములో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో  జూలై 06న పత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఇంఛార్జ్ అధికారి పార్థ సారధి తెలిపారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు శయన ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకం ఉంటుందని పార్థ సారధి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆసక్తి గల భక్తులు పాల్గొనాలని కోరారు.