'ఆధ్యాత్మిక ప్రయాణంలోనే మానసిక ప్రశాంతత'
SKLM: ఆధ్యాత్మిక ప్రయాణంలోనే మానసిక ప్రశాంతత లభ్యమవుతుందని ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మండలం బంటుపల్లి గ్రామంలో భవానీలు సామూహిక ఇరుముడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భవాని అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ దశదిశల అభివృద్ధి చెందుతుందన్నారు. భక్తులు ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించి పూలమాలలతో సత్కరించారు.