ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరి: ట్రాఫిక్ సీఐ
KRNL: ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సీఐ అబ్దుల్ గౌస్ గురువారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలైతే బతకడం కష్టమని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, మీ కుటుంబం మీ కోసం ఎదురు చూస్తుందని సీఐ పిలుపునిచ్చారు.