55 ప్రీ ప్రైమరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

55 ప్రీ ప్రైమరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

BHPL: జిల్లాలో 55 ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా తాత్కాలిక పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజేందర్ తెలిపారు. ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్మీడియట్ అర్హతతో నెలకు రూ.8 వేలు, ఆయాకు 7వ తరగతి అర్హతతో రూ.6 వేల వేతనం ఉంటుందన్నారు. ఆసక్తిగల మహిళలు జిల్లా విద్యా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.