ప్రకాశం ఎస్పీని కలిసిన జాయింట్ కలెక్టర్‌

ప్రకాశం ఎస్పీని కలిసిన జాయింట్ కలెక్టర్‌

ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కల్పనా కుమారి శుక్రవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన జేసీ కల్పనాకుమారి ఎస్పీని కలిసి బోకేను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా స్థితిగతులపై కొద్దిసేపు చర్చించిన అనంతరం, నూతన జేసీకి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.