2 గంటలకు కౌంటింగ్.. లోకల్ కింగ్ ఎవరో..?
KMR: రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పోలింగ్ బూత్‌ల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 2గంటలకు కౌంటింగ్ ప్రారంభించి విజేతలను ప్రకటిస్తారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించి ఆ తర్వాత వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించి రిజల్ట్స్ వెల్లడిస్తారు. సర్పంచ్ రిజల్ట్స్ పూర్తవగానే ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు.