చంద్రకళకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గౌరవం
NRML: సోన్ మండలానికి చెందిన గిరిజన మహిళా, పారిశ్రామికవేత్త సంగెం చంద్రకళకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ NSTFDC అవార్డుకు ఎంపికై, న్యూఢిల్లీలో గురువారం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువాల్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. పాక్‌పట్ల గ్రామానికి చెందిన ఆమె చీరల దుకాణం నిర్వహిస్తూ మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.