నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలో బంగారు పతకం
VZM: బెంగుళూరులో నిన్న నిర్వహించిన నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలలో రెండు కేటగిరీలలో రాజాం మండలం పొగిరికి చెందిన కెల్ల బాలాజీ బంగారు పతకం సాధించారు. ఈయన తండ్రి సూర్యారావు రాజాంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గోల్డ్ మెడల్ సాధించడంతో తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు. మరిన్ని గోల్డ్ మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు.