VIDEO: బైకు అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: బైకు అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: వాల్మీకిపురం వద్ద సోమవారం రాత్రి బైకు అదుపుతప్పి పడడంతో సత్యసాయి జిల్లా వాసి ఆదిమూర్తి (37) తీవ్రంగా గాయపడ్డాడు. కొక్కంటి క్రాస్ సమీపంలోని తమ్మిశెట్టి పల్లెకు చెందిన ఆదిమూర్తి భవన కార్మికునిగా పనిచేస్తున్నాడు. సొంత పనిపై తిరుపతికి వెళ్లి తిరిగి ఇంటికి బైకుపై వస్తుండగా రోడ్డుపై ఆవు అడ్డురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.