VIDEO: ఘనంగా నాగుల చవితి వేడుకలు
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కార్తీక మాసం, నాగుల చవితి సందర్భంగా నాగ దేవత పుట్ట దగ్గర మహిళా భక్తులు, అయ్యప్ప స్వాములు, శివయ్య స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పుట్టలో పాలు పోసి, కార్తీక దీపాలు వెలిగించి, స్వామివారినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వచ్చిన భక్తులకు నాగమయ్య కమిటీ తీర్థప్రసాదాలు అందించారు.