లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

KMR: బీర్కూరు మండలం బరంగ్ ఏడిగికి చెందిన దర్జీ అశోక్ ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 50,000 చెక్కును శుక్రవారం రెంజర్ల అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగొండ, దేవానంద్ దేశాయ్, లక్కపల్లి శ్రీనివాస్ అతనికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జంగం అశోక్, బీరుగొండ, సాయిలు, లింగం, పీరుగొండ ఉన్నారు.