ముఖ్యమంత్రిని కలిసిన టీడీపీ నాయకుడు సయ్యద్

CTR: పుంగనూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకుడు సయ్యద్ సుహెల్ బాషా శనివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు, ఐటీ , విద్య శాఖ మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలోని ప్రజల సమస్యల గురించి లిఖితపూర్వకంగా రాసి వినతి పత్రాన్ని అందజేశారు.