విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
MBNR: జడ్చర్ల నియోజకవర్గం నవాబు పేట మండలం యన్మన్ గండ్లకు చెందిన జగదీశ్ (28) బులెరో వాహనంలో బుధవారం ఒక రైతు పొలంలో నర్సరీ చెట్లను తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో కంచెలోని విద్యుత్ వైర్లను తప్పిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు రైతులు తెలిపారు. ఈ దుర్ఘటనలో అతనితో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.