'నిమజ్జనానికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు'

HYD: SEP 6న జరగనున్న HYD ఖైరతాబాద్, ఇతర ప్రాంతాల గణపతుల నిమజ్జనానికి విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని TGSPDCL MD ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. 68 కంట్రోల్ రూంలు, 104 అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. తీగల మరమ్మతులు, ఎర్తింగ్ పనులు పూర్తి చేసి, ప్యూజ్ బాక్స్‌ల వద్ద PVC పైపులు, ప్లాస్టిక్ షీట్లు అమర్చినట్లు వివరించారు.