ధనుర్మాసం సందర్భంగా పాదయాత్ర
VZM: కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామం శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ రాపర్తి జగదీష్ బాబు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. శనివారం ధనుర్మాసం సందర్భంగా మంగళపాలెం చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో సింహాచలం వరకు పాదయాత్ర చేశారు. ప్రతి ఏడాది ధనుర్మాసం భక్తులతో పాదయాత్ర భజనలు చేసుకొంటూ సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకొంటామని నిర్వాహకులు చెప్పారు.