అరటి తోట నేలమట్టం

అరటి తోట నేలమట్టం

GDWL: అయిజ మండలం మేడికొండ గ్రామంలో బుధవారం రాత్రి వీచిన గాలివాన బీభత్సం సృష్టించింది. కుమ్మరి తిమ్మప్ప అనే రైతుకు చెందిన రెండు ఎకరాల అరటి తోట గాలి ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. పంట చేతికొచ్చే సమయంలో ఈ విపత్తు సంభవించడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోట సాగు కోసం దాదాపు ఎనిమిది లక్షల రూపాయల పైగా పెట్టుబడి పెట్టానని తెలిపారు.