గల్లంతయిన వ్యక్తి మృతదేహం లభ్యం

గల్లంతయిన వ్యక్తి మృతదేహం లభ్యం

కొత్తగూడెం: దుమ్ముగూడెం మండలం తూరుబాక పంచాయతీ రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఎర్రబోలు కోటిరెడ్డి(30) రెండు రోజుల క్రితం బూర్గంపూడు మండలం ఇరవెండిలోని గోదావరి నదిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్నబూర్గంపూడు ఎస్సై చర్యలు చేపట్టగా బుధవారం మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.