'రైతులను తప్పుదారి పట్టిస్తున్న వైసీపీ'

KKD: ఉనికి కోసం ఫేక్ పార్టీ విన్యాసాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న వైసీపీకి రైతుల గురించి మాట్లాడే అర్హతా ఉందా? అని కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. పంట కాలువల్లో పూడిక తీయని, పొలంలో అడుగుపెట్టని వైసీపీ నాయకులు రైతుల సంక్షేమం గురించి డ్రామాలు చేయడం విచిత్రమంగా ఉందన్నారు.