ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెక్కులు: కలెక్టర్
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ నష్టపరిహారం చెక్కులను అందించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.