మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డికి కీలక పదవి

ATP: రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి బీజేపీ అధిష్టానం కీలక పదవి అప్పగించింది. ఆయనను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా ఆయన పని చేశారు. అయితే, గత ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.