వాహనం ఢీకొని కార్మికుడు మృతి
PLD: ఎడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని బీహార్‌కు చెందిన బాగీ బింద్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఉపాధి కోసం నిన్ననే అతను ఇక్కడికి వచ్చాడు. రాత్రి బోయపాలెం నుంచి వస్తుండగా సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.