ప్రారంభమైన చింతల ముని జాతరోత్సవాలు
GDWL: మల్దకల్ మండలంలోని ఎల్కూరు గ్రామంలో ఆదివారం చింతల ముని జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున సంబంధిత కార్యక్రమాలను ప్రారంభించారు. చింతల ముని రథంను గ్రామంలో ఊరేగించగా స్థానికులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అడుగడుగునా ప్రత్యేక అభిషేకాలను చేశారు. కాగా ఉత్సవాలు మూడు రోజులపాటు గ్రామంలో వైభవంగా జరుగుతాయని స్థానిక ప్రజలు తెలిపారు.